'కాంతార' యూనిట్‌ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా | Kantara Movie Artist Vehicle In Road Accident | Sakshi
Sakshi News home page

'కాంతార' యూనిట్‌ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా

Nov 25 2024 4:54 PM | Updated on Nov 25 2024 5:25 PM

Kantara Movie Artist Vehicle In Road Accident

'కాంతార' సినిమా యూనిట్‌ సభ్యలకు ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్‌ను మేకర్స్‌ ఆపేశారు.   కన్నడ హీరో రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. అయితే, చిత్ర యూనిట్‌కు ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

నవంబర్‌ 24న రాత్రి షూటింగ్‌ పూర్తి చేసుకుని సుమారు 20 మంది సభ్యులతో ప్రయాణిస్తున్న మినీ బస్సుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని జడ్కల్‌లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జడ్క్‌ల్‌లోని మూడూరు నుంచి కొల్లూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కాంతార షూటింగ్‌ను ఆపేశారు.

డ్రైవర్​ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ చూస్తూ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఒక ఆర్టిస్ట్​ ఆరోపించాడు. ఘటన జరగగానే కొందరు డ్రైవర్‌పై చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా రిషభ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ దీనిని నిర్మిస్తున్నారు. 2025 అక్టోబర్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement