కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు! | Sakshi
Sakshi News home page

Rishab Shetty: రిషబ్‌ శెట్టి కూతురికి అక్షరభ్యాసం.. ఫోటోలు పంచుకున్న కన్నడ స్టార్!

Published Thu, May 23 2024 3:01 PM

Kantara Fame Rishab Shetty Shares Family Programme In Temple

కాంతారా మూవీతో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్‌ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్‌ కాంతార  ప్రీక్వెల్‌ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్‌లాల్‌ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా రిషబ్‌ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్‌ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement