సలార్‌తో పోటీ పడిన సూపర్‌ హిట్‌ మూవీ.. ఓటీటీకి వచ్చేస్తోంది! | Kannada Super Hit Movie Darshan Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Darshan Movie In OTT: ఓటీటీకి వచ్చేసోన్న రూ.200 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!

Published Thu, Feb 1 2024 9:30 PM

Kannada Super Hit Movie Darshan Movie Straming - Sakshi

కన్నడ ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా కర్ణాటకలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తరుణ్ సుధీర్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9న నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. పెద్ద సినిమాతో పోటీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్‌ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

అయితే మొదట దర్శన్ బర్త్‌ డే సందర్భంగా ఈనెల 16న ఓటీటీకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ వారం రోజులు ముందుగానే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అయితే ఈనెల 9న కేవలం కన్నడలోనే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వర్షన్లు మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్‌  కానున్నట్లు తెలుస్తోంది. 

కాగా.. కాటేరా 2023లో శాండ‌ల్‌వుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.ఈ చిత్రంలో సీనియ‌ర్ క‌థానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధ‌న రామ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే ఆమె క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాక్‌లైన్ వెంక‌టేష్ ఈ మూవీని నిర్మించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement