కన్నడ హీరో దర్శన్‌ కేసు.. అతని భార్యకు నోటీసులు! | Kannada Hero Darshan Wife Vijayalakshmi Meets Him At Bengaluru Police Station | Sakshi
Sakshi News home page

Darshan Case: కన్నడ హీరో దర్శన్‌ కేసు.. పీఎస్‌కు వచ్చిన హీరో భార్య!

Published Wed, Jun 19 2024 3:39 PM | Last Updated on Wed, Jun 19 2024 4:20 PM

kannada hero Darshan Wife Vijayalakshmi Meets Him In Bengaluru Police Station

ప్రస్తుతం శాండల్‌వుడ్‌ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. 

అయితే హీరో దర్శన్‌కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్‌లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు.  అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్

అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్‌ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement