విడాకులు తీసుకోనున్న 'బిగ్‌బాస్' బ్యూటీ | Kannada Actress Shubha Poonja Divorce | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకోనున్న 'బిగ్‌బాస్' బ్యూటీ

Jun 5 2026 8:29 AM | Updated on Jun 5 2026 11:11 AM

Kannada Actress Shubha Poonja Divorce

కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్ శుభ పూంజా పెళ్లి జీవితం ముగింపు దశకు చేరుకుంది. భర్త నుంచి ఈమె విడిపోవాలని నిర్ణయించుకుంది. నాలుగేళ్ల క్రితం నటి శుభ పూంజా, సుమంత్‌ బిల్లవ పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నేళ్లకే పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు.

కన్నడ వ్యాపారి అయిన సుమంత్‌ బిల్లవ స్వస్థలం ఉడుపి. ఇతడు నటి శుభ పూంజా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2022 జనవరి 5న వివాహం జరిగింది. మరి ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో అర్జీ వేశారు. వచ్చే వాయిదా రోజున ఇద్దరు కోర్టుకు వెళ్లి జడ్జి ముందు హాజరై విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement