ఓటీటీలోకి సస్పెన్స్, థ్రిల్లర్ ‘కన్‌ఖజురా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..? | Kankhajura OTT Release Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి సస్పెన్స్, థ్రిల్లర్ ‘కన్‌ఖజురా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

May 13 2025 5:55 PM | Updated on May 13 2025 6:52 PM

Kankhajura OTT Release Date Out

మలయాళ నటుడు రోషన్ మాథ్యూ,బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కన్‌ఖజురా’ టీజర్‌ తాజాగా రిలీజైంది.  ఈ సిరీస్‌ గోవాలో జరిగే నేరాల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. నిశ్శబ్దం మోసపూరితంగా, బయటకు కనిపించే దానికంటే ప్రమాదకరంగా ఉంటుందనే ట్యాగ్‌లైన్‌తో ఈ సిరీస్‌ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్‌ సిరీస్‌ ‘మాగ్పీ’ ఆధారంగా ఈ సిరీస్‌ను హిందీ ప్రేక్షకుల కోసం అనువదించగా, భారతీయ ప్రేక్షకుల సంస్కృతికి తగ్గట్టు స్థానికీకరణ చేసి తెరకెక్కించారు.

‘కన్‌ఖజురా’ కథ విడిపోయిన ఇద్దరు సోదరుల మధ్య జరిగే సంఘర్షణ, వారి చీకటి గతంతో పోరాటం, జ్ఞాపకశక్తి మరియు వాస్తవికత మధ్య నలిగిపోయే సంఘటనల చుట్టూ నడుస్తుంది. ఈ కథలో భావోద్వేగ తీవ్రత, గందరగోళం, మరియు నిశ్శబ్దంలో దాగి ఉన్న తుఫాను వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.

సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన నటుడు రోషన్‌ మాథ్యూ మాట్లాడుతూ, “‘కన్‌ఖజురా’ ఒక ఎమోషనల్‌ రోలర్‌కోస్టర్‌. ఈ కథలోని భావోద్వేగ తీవ్రత, నిశ్శబ్దంలో దాగి ఉన్న గందరగోళం నన్ను ఈ పాత్రలో నటించేలా ప్రేరేపించాయి. నా పాత్ర ‘అషు’లో బహుముఖీయత ఉంది. ఒక్కో క్షణంలో ఒక్కోలా మారుతూ, లోపల నిశ్శబ్ద తుఫానును మోస్తుంది. ఈ సిరీస్‌ ప్రేక్షకుల హృదయాలను కదిలించడమే కాకుండా, వారిని వెంటాడుతుంది” అని అన్నారు.
ఈ చిత్రానికి అరోరా దర్శకత్వం వహించగా, అజయ్‌ రాయ్‌ నిర్మాతగా వ్యవహరించాడు. సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా  ఇతర కీలక పాత్రలు పోషించారు. మే 30 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement