bollywood actress kangana ranaut spent 25 crores for action sequence in dhaakad movie - Sakshi
Sakshi News home page

కంగనా ఇరవై అయిదు కోట్ల ఫైట్‌!

Feb 6 2021 12:20 AM | Updated on Feb 6 2021 11:00 AM

Kangana Ranaut Says 25 Crores Spent Action Sequence For Dhaakad - Sakshi

‘థాకడ్‌’లో... కంగనా రనౌత్‌ 

కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. హీరోల సినిమాలు అమ్ముడుపోయినంతగా, వసూళ్ళు చేసేంతగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేయవు కాబట్టి తక్కువ బడ్జెట్‌లో ముగించాలనుకుంటారు. అయితే హిందీలో ఇటీవల కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా వసూళ్లు రాబట్టగులుతున్నాయి. అందుకే కంగనా రనౌత్‌ కథానాయికగా చేస్తున్న ‘థాకడ్‌’ చిత్రానికి భారీ ఖర్చుగా పెడుతున్నారు. ఈ చిత్రంలోని ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌కే ఏకంగా రూ. 25 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారని కంగనా తెలియజేశారు.

‘‘రిహార్సల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి దర్శకుడిని నేను చూడలేదు. రేపు రాత్రి నుంచి ఒక భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నాం. ఈ యాక్షన్‌ సీన్‌కి ప్రిపేర్‌ అవడం బాగుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కుదిరింది’’ అని శుక్రవారం తెలిపారు కంగన. అది మాత్రమే కాదు.. మన దేశంలో రూపొందుతున్న పూర్తి స్థాయి ఫీమేల్‌ లీడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇదే అని ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అప్పుడే కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. రజనీష్‌ ఘయ్‌ దర్శకత్వంలో నిర్మాణ సంస్థలు సోహెల్‌ మక్లాయ్, ఆసిలమ్‌ ఫిలిమ్స్, క్యూకీ డిజిటల్‌ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 1న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement