‘విక్రమ్‌’ సెట్‌లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన కమల్‌

kamal Haasan Vikram Movie Shoot Progressing In Mumbai - Sakshi

కరోనా పాజిటివ్‌తో కొన్నాళ్లు ఐసోలేషన్‌లో ఉన్న కమల్‌హాసన్‌ ఇటీవల సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బుధవారం ‘విక్రమ్‌’ సినిమా షూట్‌లోకి కూడా ఎంటర్‌ అయ్యారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ఆరంభమైంది. అప్పటినుంచి పలు షెడ్యూల్స్‌ జరిగాయి.

ఇంకొన్నాళ్లు షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తవుతుందన్న పరిస్థితిలో అనుకోకుండా కమల్‌ కరోనా బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి కాంబినేషన్‌లో  సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ‘‘చిన్న బ్రేక్‌ తర్వాత  స్టార్‌ (కమల్‌ని ఉద్దేశించి) షూట్‌కి వచ్చారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు’’ అన్నారు లోకేశ్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top