కొత్త సినిమా షురూ చేసిన మెగా అల్లుడు కల్యాణ్‌ దేవ్‌

Kalyan Dev New Film Launched - Sakshi

‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఎం. కుమారస్వామి నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కథ కంచికి మనం ఇంటికి’ చిత్రనిర్మాత మోనిష్‌ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్‌ చివరి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: దత్తి సురేష్‌ బాబు, నిర్మాణ నిర్వహణ: గౌతి హరినాథ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుభాష్‌ దేవబత్తిని, కెమెరా: వైఎస్‌ కృష్ణ. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top