ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌తో ఇప్పటి వరకు సినిమా రాలేదు: రాజేశ్వరి చంద్రజ | Kalasa Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌తో ఇప్పటి వరకు సినిమా రాలేదు: రాజేశ్వరి చంద్రజ

Published Thu, Dec 14 2023 10:34 AM | Last Updated on Thu, Dec 14 2023 10:46 AM

Kalasa Movie Pre Release Event Highlights - Sakshi

‘‘రాంబాబుగారు ‘కలశ’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యాను. ఇప్పటివరకూ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌తో సినిమా రాలేదని చెప్పగలను. సైకలాజికల్‌ థ్రిల్లర్, హారర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’’ అని రాజేశ్వరి చంద్రజ వాడవల్లి అన్నారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో కొండ రాంబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘కలశ’.

రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించిన ఈ సినిమా నెల 15న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌కి అతిథులుగా విచ్చేసిన నటుడు మురళీమోహన్‌ ‘ఓ చిట్టి తల్లి..’ అనే పాటని, దర్శకుడు వీర శంకర్‌ ‘కలశ..’ అనే టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. ‘మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌. థ్రిల్లర్‌ అంటే రాతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తీత అంటే కెమెరా వర్క్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.

అలాగే సంగీతానికి కూడా. వీటి విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని పోస్టర్స్‌ చూస్తుంటే తెలుస్తోంది. నిర్మాత రాజేశ్వరి గారు ఈ చిత్రం పట్ల చూపించిన శ్రద్ధ ట్రైలర్‌ చూస్తుంటేనే అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.  కొండా రాంబాబు మాట్లాడుతూ– ‘‘చంద్రజగారు, స్వామిగార్లకు ఇది తొలి సినిమా అయినా బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేదు’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement