ఫ్యాన్స్ చేసిన పనికి కాజల్ అగర్వాల్ ఎమోషనల్ | Kajal Aggarwal Birthday And Fans Distribute Food Latest | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: కాజల్ బర్త్ డే... ఫ్యాన్స్ గుర్తుండిపోయే సాయం!

Published Thu, Jun 20 2024 2:17 PM | Last Updated on Thu, Jun 20 2024 3:26 PM

Kajal Aggarwal Birthday And Fans Distribute Food Latest

హీరోయిన్ కాజల్ అగర్వాల్ 39వ పుట్టినరోజుని తాజాగా జరుపుకొంది. ఈ క్రమంలోనే అభిమానులు, తోటీ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెప్పారు. అందరూ శుభాకాంక్షలు చెప్పి వదిలేశారు కానీ కాజల్ ఫ్యాన్స్ మాత్రం చాలాకాలం గుర్తుండిపోయే పని చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)

ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్.. 'లక్ష‍్మీ కల్యాణం' సినిమాతో హీరోయిన్ అయింది. 'మగధీర' మూవీతో స్టార్ హోదా సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా నటించేసింది. కరోనా లాక్‌డౌన్ టైంలో ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు పుట్టాడు.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఈ మధ్య 'సత్యభామ' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే కాజల్ ఫ్యాన్స్.. ఈమె పుట్టినరోజు సందర్భంగా 150 మందికి ఫుడ్ పంచారు. అలానే ఈ నెలాఖరులోపు 50 మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. దీని గురించి తెలిసి కాజల్ భావోద్వేగానికి గురైంది. అద్భుతమైన పని చేశారని చెప్పి మెచ్చుకుంది.

(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement