Junior NTR New Look: జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ వైరల్.. ఆ సినిమా కోసమేనా?

Junior NTR Shared A new Look Story In Instagram Goes Viral - Sakshi

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా ఆ క్రేజే వేరు. తాజాగా న్యూ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు యంగ్ టైగర్. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ కొత్త స్టైల్ అంతా తదుపరి చిత్రం 'ఎన్టీఆర్30' కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఎన్టీఆర్ తన ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేస్తూ..' ఏ న్యూ డే.. ఏ న్యూ వైబ్' అలీమ్‌హకీంతో మరోసారి అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్‌తో పాటు హెయిల్ స్టైలిస్ట్ అలీమ్ హకీం కూడా వెనకవైపు ఉన్నారు. దీనిపై జూనియర్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్30 సినిమాలో లుక్ ఇదేనంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

(చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!)

కాగా.. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌30 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన పోస్టర్‌ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్‌ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top