కంగ్రాట్స్‌ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్‌ | Jr NTR Wishes Allu Arjun Over He Won National Best Actor Award | Sakshi
Sakshi News home page

Jr NTR: కంగ్రాట్స్‌ బావా.. ఈ అవార్డులు, సక్సెస్‌ నీకు దక్కాల్సిందే!

Published Thu, Aug 24 2023 6:55 PM | Last Updated on Thu, Aug 24 2023 7:30 PM

Jr NTR Wishes Allu Arjun Over He Won National Best Actor Award - Sakshi

పుష్ప సినిమాకుగానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప డైలాగ్‌ మిస్‌ చేశారు సర్‌.. అని కామెంట్లు చేస్తున్నారు.

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు మన తెలుగు హీరోకు వరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎందరో స్టార్‌ హీరోలను వెనక్కి నెడుతూ అల్లు అర్జున్‌కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వరించింది. 68 ఏళ్లుగా ఏ హీరోకూ దక్కని అరుదైన గౌరవం బన్నీకి దక్కింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

తాజాగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ బన్నీని అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. కంగ్రాచ్యులేషన్స్‌ బావా.. పుష్ప సినిమాకుగానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప డైలాగ్‌ మిస్‌ చేశారు సర్‌.. అని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకుగానూ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ఉప్పెన, బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ప్రొవైడింగ్‌ వోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డులు ఎగరేసుకుపోయాయి. ఇంకా ఏయే సినిమాకు ఏయే అవార్డులు వచ్చాయంటే..

ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ) - కింగ్‌ సాల్మన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - వి.శ్రీనివాస్‌ మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ లిరిక్స్‌- చంద్రబోస్‌ (ధమ్‌ ధమా ధమ్‌- కొండపొలం)

 ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌(సాంగ్స్‌) - దేవి శ్రీప్రసాద్‌ (పుష్ప 1)
 ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బ్యాగ్రౌండ్‌ స్కోర్‌) - ఎమ్‌ఎమ్‌ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
 ఉత్తమ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్‌ఆర్‌ఆర్‌)
 బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు

చదవండి: చరణ్‌, తారక్‌ను వెనక్కు నెట్టి అవార్డు కొట్టేసిన బన్నీ.. టాలీవుడ్‌కు మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement