చిన్న సెంటిమెంట్‌

Jr NTR to join hands with Trivikram Srinivas for his 30th film - Sakshi

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు ఎన్టీఆర్‌. ఈ సినిమా టైటిల్‌ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను నిర్మాత నాగవంశీ ఇచ్చారు. ‘‘యంగ్‌ టైగర్‌ అభిమానులందరూ ‘ఎన్టీఆర్‌ 30’ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు.

కానీ సినిమాకు సంబంధించిన ఏ ప్రకటన అయినా షూటింగ్‌ ప్రారంభించాక ప్రకటించాలనే చిన్న సెంటిమెంట్‌ మా నిర్మాణ సంస్థకు ఉంది. షూటింగ్‌ జరపకముందే ఏదీ ప్రకటించడానికి పెద్దగా ఇష్టపడం. కానీ మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విశేషాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది’’ అని అన్నారు. హారికా హాసినీ, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top