ఎయిర్‌పోర్టులో తారక్‌, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్‌ | Jr NTR Again Going to Vacation With Family Airport Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Jr NTR: ఎయిర్‌పోర్టులో తారక్‌, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్‌

Published Sat, Dec 10 2022 1:49 PM | Last Updated on Sat, Dec 10 2022 2:06 PM

Jr NTR Again Going to Vacation With Family Airport Photo Goes Viral - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ సెట్‌లో ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని ఫ్యాన్స్‌ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో అలరించిన తారక్‌ నెక్ట్స్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాను ప్రకటించి నెలలు గుడుస్తున్నా ఇప్పటికీ సెట్స్‌పై రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఏకంగా నాలుగేళ్లు కేటాయించిన తారక్‌ మూవీ విడుదల అనంతరం కాస్తా విరామం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి విదేశాలు చూట్టేస్తున్నాడు.

ఇక రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫ్యామిలీతో జపాన్‌ వెళ్లిన ఎన్టీఆర్‌ ఇటివలె ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడైన షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాడు అనుకుంటే మళ్లీ ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేశాడు. తాజాగా భార్య లక్ష్మి ప్రణతి, తనయులు అభయ్‌ రాం, భార్గవ్‌ రాంలతో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చాడు. దాదాపు నెల రోజుల వరకు ఈ వెకేషన్‌లో ఉండనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఇప్పట్లో తారక్‌-కొరటాల మూవీ సెట్స్‌పైకి వచ్చేలా లేదంటూ ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అనంతరం భార్యతో కలిసి విదేశాలు చూట్టేసిన చరణ్‌ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ వెంటనే శంకర్‌తో ఆర్‌సీ 15 మూవీ సెట్‌లో అడుగు పెట్టడమే కాకుండా తన మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టాడు. కానీ తారక్‌ మాత్రం కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌తో చిత్రాలు ప్రకటించిన ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్స్‌ సంబంధించి ఎలాంటి అప్‌డేట్ బయటకు రావడం లేదు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తాడా? అని నందమూరి అభిమానులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: 
కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు
హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న అజిత్‌ రీల్‌ కూతురు బేబీ అనిఖా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement