Jennifer Lopez And Ben Affleck Get Married In Las Vegas - Sakshi
Sakshi News home page

Jennifer Lopez: నటుడితో డేటింగ్‌, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్‌ సింగర్‌

Jul 18 2022 10:47 AM | Updated on Jul 18 2022 11:25 AM

Jennifer Lopez and Ben Affleck Get Married in Las Vegas - Sakshi

అమెరికన్‌ సింగర్‌, నటి జెన్నీఫర్‌ లోపెజ్‌ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్‌ అఫ్లెక్‌, జెన్నీఫర్‌ డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్‌ తన ఇన్‌స్టా‍గ్రామ్‌ వేదికగా వెల్లడించింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ పెట్టుకున్న ఫొటోలను షేర్‌ చేస్తూ బెన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటిచింది.

చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’, కోర్టు నోటీసులు

కొద్ది మంది సన్నిహితులు మధ్య జూలై 16న లాస్‌ వెగాస్‌లో  సీక్రెట్‌గా ఈ జంట పెళ్లి జరిగినట్లు స్టానిక మీడియా పేర్కొంది. దీంతో ఈ జంటకు సహా నటీనటులు, ఫాలోవర్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ జంట కొత్త ఇంటిని వేతికే పనిలో పడ్డారని, ఆఖరికి బెవర్లీ హిల్స్‌లో ఇల్లు కొనుగొనుల చేశారని సమాచారం. కాగా 52 ఏళ్ల జెన్నీఫర్‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెన్‌ అఫ్లెక్స్‌ను 4వ వివాహం చేసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement