Arrerere Jathi Ratnalu Song, Ram Miriyala | Special Song on Jathi Ratnalu Movie Team - Sakshi
Sakshi News home page

‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు’‌

Mar 20 2021 11:44 AM | Updated on Mar 20 2021 1:30 PM

Jathi Ratnalu Special Song Goes Viral - Sakshi

అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్‌ సాంగ్‌ని వైజయంతి నెట్‌వర్క్‌ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘జాతిరత్నాలు. కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ స‌రికొత్త వినోదాన్ని పంచింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్‌ సాంగ్‌ని వైజయంతి నెట్‌వర్క్‌ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

రామ్‌ మిర్యాల పాడిన ఈ పాట సోషల్‌ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ పాటకు సంబంధించిన వీడియోలో సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ని పంచుకున్నారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రంలో హైదరాబాద్‌ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. 


చదవండి:
చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది
‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కు గుడ్‌‌ న్యూస్‌‌‌‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement