విజయ్‌ కుమారుడు జేసన్‌ ఫస్ట్‌ సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే? | Jason Sanjay First Movie Motion Poster Out Now | Sakshi
Sakshi News home page

విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా పోస్టర్‌ రిలీజ్‌

Published Fri, Nov 29 2024 6:13 PM | Last Updated on Fri, Nov 29 2024 6:38 PM

Jason Sanjay First Movie Motion Poster Out Now

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా తన మొదటి సినిమాను అధికారికంగా ప్రకటించాడు. తన ఫస్ట్‌ సినిమాను టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌తో ఆయన చేయనున్నారు. ఈమేరకు తాజాగా మోషన్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ సినిమా తమిళ్‌, తెలుగులో మాత్రమే విడుదల కానుంది. సందీప్‌ కిషన్‌కు తెలుగుతో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్‌ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మంచి ప్లస్‌ కానుంది. రీసెంట్‌గా రాయన్‌ చిత్రంలో తనదైన స్టైల్లో సందీప్‌ కిషన్‌ మెప్పించారు.  సంగీతం థమన్‌ అందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి మా సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. ఆయ‌న తెర‌కెక్కించబోతున్న క‌థ, ఆయ‌న నెరేష‌న్ విన్న‌ప్పుడు డిఫ‌రెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్ర‌ధాన‌మైన పాయింట్‌ ఉంది. మ‌నం ఎక్క‌డా పొగొట్టుకున్నామో అక్క‌డే వెత‌కాలి అన‌టాన్ని మనం చాలా సంద‌ర్భాల్లో వినే ఉంటాం. కానీ దాని కోసం మ‌నం ఏం వెచ్చిస్తామ‌నేదే ప్ర‌ధాన పాయింట్‌గా సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ చిత్రంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన సందీప్ కిష‌న్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. 

ఈ స‌రికొత్త కాంబో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభ‌వాన్నిస్తుంద‌ని మేం భావిస్తున్నాం' అన్నారు. సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ 'తమన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇంకా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. త్వ‌ర‌లోనే వారి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. 2025 జ‌న‌వ‌రి నుంచి సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాం.' అని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement