ప్రతి ముఖం ఓ కథ చెబుతుందంటున్న జాన్వీ కపూర్‌! | Janhvi Kapoor Ulajh Movie Release Date Out | Sakshi
Sakshi News home page

ప్రతి ముఖం ఓ కథ చెబుతుందంటున్న జాన్వీ కపూర్‌!

Jul 12 2024 8:16 AM | Updated on Jul 12 2024 8:36 AM

Janhvi Kapoor Ulajh Movie Release Date Out

ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌) విభాగంలో ఆఫీసర్‌గా ఉద్యోగం చేసి ఓ కుట్రను గురించి కాన్ఫిడెన్షియల్‌ ఫైల్‌ను రెడీ చేశారు జాన్వీ కపూర్‌. మరి... ఈ ఫైల్‌లో ఉన్న వివరాలు ఏంటి? నిజమైన కుట్రదారులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం ‘ఉలజ్‌’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలోనే జాన్వీ కపూర్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీకి సుధాంశు సరియ దర్శకత్వం వహించారు. 

ముందు ‘ఉలజ్‌’ను జూలై 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ రిలీజ్‌ కాలేదు. దీంతో ఆగస్టు 2న రిలీజ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త ఫోటోలను విడుదల చేసింది యూనిట్‌. ‘‘ప్రతి ముఖం ఓ కథ చెబుతుంది. ప్రతి కథ ఓ ఉచ్చులాంటిదే’’ అని ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు జాన్వీ కపూర్‌. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ ‘దేవర’, రామ్‌చరణ్‌ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), హిందీలో వరుణ్‌ ధావన్‌ ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తున్నారు జాన్వీ కపూర్‌.  

Advertisement
 
Advertisement
Advertisement