'జన నాయగన్‌' లీక్‌ కేసులో అసలు దొంగ ఎవరంటే.. | Jana Nayagan movie leak behind person arrested by Tamil Nadu police | Sakshi
Sakshi News home page

'జన నాయగన్‌' లీక్‌ కేసులో అసలు దొంగ అరెస్ట్‌

Apr 17 2026 7:35 AM | Updated on Apr 17 2026 8:31 AM

Jana Nayagan movie leak behind person arrested by Tamil Nadu police

విజయ్ నటించిన 'జననాయగన్‌'  మూవీ  లీక్‌తో సంబంధం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. మరో సినిమాకు  ఫ్రీలాన్స్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పని చేస్తున్న వ్యక్తే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ఫ్రీలాన్స్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌గా ఉన్న సదరు వ్యక్తి తరచుగా  ‘జన నాయగన్‌’ మూవీ ఎడిటింగ్‌ జరిగే స్టూడియోలోకి వెళ్లేవాడు. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన కొంత డేటాను దొంగలించి.. దానినే సినిమాగా మార్చాడు. ఆపై తనకు తెలిసిన వారితో ఆ పుటేజీని పంచుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్‌ ఆన్‌లైన్‌లో కనిపించాయి. పూర్తి ఆధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి రిమాండ్‌ విధించింది.

'జననాయగన్‌'  మూవీ  లీక్‌ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఆపై కోయంబత్తూర్‌ లోకల్‌ ఛానల్‌లో మూవీ ప్రసారం కావడంతో ఆ ఛానల్‌ యజమానిని కూడా పోలీసులు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో చెన్నై సైబర్‌ క్రైమ్‌ విభాగం ప్రేక్షకులకు ఒ క విజ్ఞప్తి చేసింది.  అనధికారికంగా ఇలాంటి వీడియోలను ఎవరితోనైనా షేర్‌ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.

జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా యాక్ట్‌ చేస్తున్నారు. కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, మూవీ లీక్‌ కావడం ఆపై సెన్సార్‌ చిక్కుల వల్ల విడదల అంశంలో జాప్యం  ఏర్పడటంతో భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement