Jagapathi Babu: పుష్ప-2లో జగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు! | Jagapathi Babu Confirms Entry In Allu Arjun’s Pushpa 2 Movie - Sakshi
Sakshi News home page

Jagapathi Babu: అప్పుడు బన్నీ ఎవరో కూడా తెలియదు: జగపతి బాబు

Apr 21 2023 8:17 AM | Updated on Apr 21 2023 9:19 AM

Jagapathi Babu confirms entry in Allu Arjun Pushpa 2 - Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్, నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా తాజాగా నటిస్తున్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో జగపతిబాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

పుష్ప సినిమాతో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన బాక్సాఫీస్ సునామీ మనందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది పుష్ప2. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెుత్తం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, అల్లు అర్జున్ పిక్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పుష్ప-2 చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 

హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జగపతిబాబు.. విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రల్లో మెప్పించారు. తాజాగా పుష్ప-2లో ఓ క్రేజీ క్యారెక్టర్‌తో అభిమానులను అలరించనున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ప్రమోషన్స్‌లో  పాల్గొన్న జగపతిబాబు పుష్ప-2లో నటిస్తున్నట్లు తెలిపారు. 

జగపతి బాబు మాట్లాడుతూ..'సుకుమార్‌తో కలిసి పనిచేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పుష్ప-2లో  ఛాలెంజింగ్ పాత్రలోనే నటిస్తున్నా. నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయడమే ఇష్టం. సుక్కుతో కలిసి పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా.' అంటూ చెప్పుకొచ్చారు. బన్నీ గురించి చెబుతూ.. దాదాపు 20 ఏళ్ల క్రితం అల్లు అర్జున్‌ను జిమ్‌లో చూశా. అప్పుడు ఎవరో కూడా నాకు తెలియదు. తాను హార్డ్ వర్క్ చేయడం గమనించా. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్న అతన్ని చూస్తుంటే గర్వంగా ఉంది.' అంటూ ప్రశంసించారు. కాగా.. ప్రస్తుతం జగపతి బాబు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సలార్‌తో పాటు కన్నడలోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement