అక్క డిప్రెషన్‌లో.. దయచేసి ప్రాణాలు తీయొద్దు.. ఏడ్చేసిన వర్ష | Jabardasth Varsha Left in Tears Over Remembering Her Sister Incident | Sakshi
Sakshi News home page

మీ డ్రైవింగ్‌ వేరొకరి జీవితానికి శాపం కాకూడదు.. చేతులెత్తి వేడుకున్న వర్ష

Jun 13 2025 5:41 PM | Updated on Jun 13 2025 7:41 PM

Jabardasth Varsha Left in Tears Over Remembering Her Sister Incident

తక్కువ కాలంలోనే బాగా పాపులర్‌ అయిన బ్యూటీ వర్ష (Varsha). సీరియల్‌ నుంచి కామెడీ షోలోకి వచ్చి హైలైట్‌ అయింది. అయితే తనపై పదేపదే కుళ్లు జోకులు వేస్తుంటే తీసుకోలేకపోయింది. ముఖ్యంగా తనది అబ్బాయి గొంతు అని, అబ్బాయిలాగే ఉంటుందని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసినప్పుడు ఒంటరిగా బాధపడింది.

డిప్రెషన్‌లో..
అలాగే తన ఇంట్లో జరిగిన ఓ విషాదకర వార్తను తాజాగా పంచుకుంది. ఓ పాడ్‌కాస్ట్‌లో వర్ష మాట్లాడుతూ.. మనకు మనుషులు చాలా అవసరం. మా అక్క ఏదో పనిమీద బావగారిని బయటకు పంపించింది. సడన్‌గా ఓ బైక్‌ ఢీ కొడితే అక్కడికక్కడే చనిపోయారు. మా అక్క డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. మా బావగారి బట్టల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి వాటిని పట్టుకునే నిద్రిస్తోంది.

 

ఎవరికీ శాపం కాకూడదు
ఆయన శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా అక్క కొడుకు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. పిన్ని, మాకు టిఫిన్‌ తెచ్చుకోవడం కూడా తెలియదు. రేపటినుంచి మేము ఎవర్ని అడగాలి? అని ఏడ్చేశాడు. డ్రైవింగ్‌ చేసే ప్రతి ఒక్కరినీ ఒకటే కోరుకుంటున్నా.. మీ నిర్లక్ష్య డ్రైవింగ్‌.. వేరొకరి ప్రాణాలు తీసేంత శాపంగా మారకూడదు అని చేతులెత్తి మొక్కుతూ ఏడ్చేసింది వర్ష.

చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక

Advertisement
 
Advertisement
Advertisement