క్రేజీ హారర్ థ్రిల్లర్.. కేక పుట్టిస్తున్న ట్రైలర్ | Sakshi
Sakshi News home page

Iraivan Trailer: హీరో vs విలన్.. ప్రతిక్షణం భయం భయం!

Published Sun, Sep 3 2023 5:41 PM

Iraivan Movie Trailer Jayam Ravi And Nayanthara - Sakshi

'తనీ ఒరువన్‌' లాంటి హిట్ తర్వాత తమిళ స్టార్ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన సినిమా 'ఇరైవన్‌'. సుధన్‌ సుందరం, జయరామ్‌.జి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు 'ఎండ్రెండ్రుమ్‌ పున్నగై', 'మనిదన్‌' వంటి సక్సెస్‌ ఫుల్‌ మూవీస్ తీసిన అహ్మద్‌.. కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. 

యువన శంకర్‌ రాజా సంగీతాన్ని,హరి కె.వేదంత్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నర నిమిషాలున్న ఇది.. హీరో vs విలన్ అనే టెంప్లేట్‌కి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: అతడి పెళ్లిలో రష్మిక.. కొత్తజంట అలా చేయడంతో!)

ట్రైలర్ ప్రకారం..  ఇందులో జయం రవి పోలీస్‌‌గా నటించాడు. 12 మంది అమ్మాయిలని చంపిన నర హంతకుడిగా రాహుల్ బోస్ యాక్ట్ చేశాడు. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ స్టోరీతో తీసిన ఈ సినిమాలో హీరో విలన్ మధ్య రసవత్తర సన్నివేశాలు చూపించారు. ఇది మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 

ఇరైవన్‌ అంటే భగవంతుడు అని అర్ధం. అయితే ఈ చిత్రంలో మనుషులను కిరాతకంగా చంపే విలన్‌ తనను దేవుడిగా భావించుకుంటాడా..? లేక ఆ నరహంతకుడిని అంతం చేసే కథానాయకుడు దేవుడా? అనేది చిత్రంలో చూడాల్సిందే. హీరోయిన్ నయనతారకు కూడా ఇందులో మంచి రోల్ చేసిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ స్టేజీపై సమంత కోసం ఆరా తీసిన నాగార్జున)

Advertisement
 
Advertisement