దివ్యను కాపాడి చెంపదెబ్బ కొట్టిన తులసి

Intinti Gruhalakshmi: Tulasi Saves Divya From Suicide Attempt - Sakshi

కుటుంబం కోసం పరితపించే తులసికి మరో గడ్డు పరిస్థితి ఎదురైంది. కళ్ల ముందే కూతురి కలలు కల్లలవుతుంటే తట్టుకోలేకపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తులసి.. దివ్య చదువుకు నందును ఎలా ఒప్పించాలా అని లోలోపలే మధనపడుతోంది. మరోవైపు దివ్య ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న తాను ఇకపై చదవకుండా ఇంట్లోనే ఉండిపోవాలా అని అయోమయంలో పడిపోయింది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లోని నేటి ఎపిసోడ్‌లో దివ్య ఏం చేసింది? తులసి కన్నకూతురును ఎందుకు కొట్టింది? అన్న విషయాలు తెలియాలంటే ఇది చదివేయండి..

త్వరగా జాయిన్‌ అవకపోతే మెడికల్‌ సీటు పోతుందని దివ్య స్నేహితురాలు ఆమెకు ఫోన్‌ చేసి చెప్పింది. మెడిసిన్‌లో చేరేందుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో టెన్షన్‌లో పడిపోయింది దివ్య. అసలే మెడిసిన్‌ చేయాలన్నది తన కల. దీంతో కూతురు భవిష్యత్తు నాశనం కాకూడదనే ఆలోచనతో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ తులసి భర్తను అభ్యర్థించింది. కానీ ఆమె మాటలకు విసుగెత్తిపోయిన నందు.. మెడిసిన్‌ చేయకపోతే దివ్య చచ్చిపోతుందా? అని మండిపడ్డాడు. ఏం చదవకపోతే నీలాగే ఇంట్లో అంట్లు తోముతుంది అని విసుక్కున్నాడు. ఈ మాటలు విన్న దివ్య హృదయం ముక్కలైంది. తను మెడిసిన్‌ చదవలేనా? డాక్టర్‌ను కాలేనా? అని ఆవేదన పడింది.

మరోవైపు నందు కూడా ఫ్రస్టేషన్‌లో అలా ఎలా మాట్లాడాను అని బాధపడ్డాడు. తనకోసం ఏమైనా చేస్తానని, తన చదువు కోసం తల తాకట్టు పెడతానని చెప్పాడు. కానీ తన చదువు ఆగిపోతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది దివ్య. కానీ సకాలంలో ఆమెను చూసిన తులసి వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆమెను కాపాడింది. తను ఏమీ మాట్లాడకపోవడంతో చాచి చెంప దెబ్బ కొట్టింది. దీంతో స్పృహలోకి వచ్చిన దివ్యను దగ్గరకు తీసుకుని లాలించింది.

చదవండి: విజయ్‌ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేస్తుంది..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top