ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి బహుమతి | Interview of Actress Gautami about Anni Manchi Sakunamule Movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి బహుమతి

May 13 2023 3:55 AM | Updated on May 13 2023 3:55 AM

Interview of Actress Gautami about Anni Manchi Sakunamule Movie - Sakshi

‘‘సినిమా నా ఫస్ట్‌ లవ్‌. అందుకే నటిగా మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించిన పలు విభాగాల్లో పని చేశాను. ఇప్పుడు ఫిల్మ్‌ మేకింగ్‌ మరింత ఆసక్తికరంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా ఉంది. నటిగా షూటింగ్స్‌ని ఎంజాయ్‌ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఒక రకంగా గర్వపడుతున్నాను కూడా’’ అన్నారు గౌతమి.

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్‌ పతాకాలపై ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గౌతమి మాట్లాడుతూ– ‘‘అన్నీ మంచి..’లో ఫ్యామిలీని బ్యాలెన్స్‌ చేసే మీనాక్షీ పాత్ర చేశాను. ఓ డ్రీమ్‌ మదర్, వైఫ్, ఫ్రెండ్‌ ఎలా ఉండాలని కోరు కుంటారో అలా ఉంటుంది మీనాక్షీ పాత్ర.

నా కెరీర్‌ తొలినాళ్లలో నేను రాజేంద్రప్రసాద్‌గారితో యాక్ట్‌ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించాను. నటన పట్ల ఆయన అంకితభావం సూపర్‌. వీకే నరేశ్, ‘షావుకారు’ జానకి, ఊర్వశి.. ఇలా అందరూ ఓకే సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అసలు.. ఇంతమంది మంచి నటీనటులను దర్శకురాలు నందినీ, నిర్మాతలు స్వప్న, ప్రియాంకాగార్లు ఓ చోటకు చేర్చి సినిమా చేయడం అద్భుతం.

ప్రేక్షకులకు ఈ సినిమా మర్చిపోలేని బహుమతి. స్వీయనియంత్రణ ఉన్న దర్శకురాలు నందిని. మంచి నిర్మాతలకు ఉండాల్సిన లక్షణాలు ప్రియాంక, స్వప్నగార్లలో ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటిగారి సినిమాలో నటిస్తున్నాను. రెండు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘మా అమ్మాయి ఫిల్మ్‌ మేకింగ్‌ చదువుతోంది. తనకు కెమెరా వెనక ఉండటం ఇష్టం’’ అని చెప్పారు గౌతమి.

Advertisement
 
Advertisement
Advertisement