‘మట్టి కుస్తీ’ భామ గురించి ఈ విషయాలు తెలుసా? | Interesting Facts About Heroine Aishwarya Lekshmi | Sakshi
Sakshi News home page

‘మట్టి కుస్తీ’ భామ ఐశ్వర్యా లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా?

Dec 3 2023 9:38 AM | Updated on Dec 3 2023 10:12 AM

Interesting Facts About Heroine Aishwarya Lekshmi - Sakshi

యాక్టర్స్‌గా మారిన డాక్టర్స్‌.. మన చిత్ర పరిశ్రమలో చాలామందే ఉన్నారు. ఆ జాబితాలోకి నటి ఐశ్వర్యా లక్ష్మి  కూడా చేరుతుంది. చిన్న పాత్రలో మెరిసి స్టార్‌డమ్‌ దిశగా దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని విషయాలు..

ఐశ్వర్యా సొంతూరు తిరువనంతపురం. ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎమ్‌బీబీఎస్‌ పూర్తి చేసింది. 

► కాలేజీ రోజుల్లోనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. 

మలయాళం, తమిళ భాషల్లో ఎక్కువగా నటించే ఐశ్వర్యా .. ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయింది. ఆ తర్వాత  ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’తో మెప్పించింది.  మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ కీలక పాత్ర పోషించింది. 

2017లో మలయాళ చిత్రం ‘న్యంగలుడే నాత్తిల్‌ ఒరిడవేల’తో వెండి తెర ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఆ చిత్రానికిగాను ఉత్తమ పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. దీంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 

నటిగా రాణిస్తూనే తన అభిరుచి మేరకు నిర్మాతగానూ మారింది. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ నిర్మాతల్లో ఐశ్వర్యా ఒకరు.

ప్రస్తుతం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’తో అలరిస్తోంది.

కుకింగ్‌ అంటే చాలా ఇష్టం. ఏ కొంచెం టైమ్‌ దొరికినా ఇంట్లో వాళ్లకు వండి వడ్డిస్తుంటా!: ఐశ్వర్యా లక్ష్మి 

Advertisement
 
Advertisement
Advertisement