Interesting Facts About Bheemla Nayak Fame Mounika Reddy - Sakshi
Sakshi News home page

‘భీమ్లా నాయక్‌’ఫేం మౌనికా రెడ్డి గుర్తుందా? పెళ్లి తర్వాత ఏం చేస్తుందో తెలుసా?

Feb 12 2023 9:55 AM | Updated on Feb 12 2023 11:57 AM

Interesting Facts About Bheemla Nayak Fame Mounika Reddy - Sakshi

వెండితెరపై నటించాలని చాలా మందికి ఉండొచ్చు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే రావచ్చు. కానీ యూట్యూబ్‌ వచ్చిన తర్వాత టాలెంట్‌ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లతో వెండితెర  చాన్స్‌లూ కొట్టేస్తున్నారు. అలా వచ్చిన నటే మౌనికా రెడ్డి..

మౌనికారెడ్డి వైజాగ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా  పని చేస్తూనే నటనపై ఉన్న మక్కువతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.

ఓవైపు  సిల్వర్‌ స్క్రీన్‌ చాన్స్‌ కోసం వేచి చూస్తూనే ఇంకోవైపు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించడం మొదలు పెట్టింది . ‘అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు’ అనే సిరీస్‌తో అప్పుగారిలా అలరించి, మంచి క్రేజ్‌  సంపాదించుకుంది. 

బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌తో కలసి నటించిన ‘సూర్య’ అనే వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌తో  సినిమా ఆఫర్లూ రావడం ప్రారంభమయ్యాయి.

పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో లేడీ కానిస్టేబుల్‌గా నటించింది. ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. 

ఇప్పుడు.. ఇటు సినిమాలు.. అటు షార్ట్‌ ఫిల్మ్స్‌ , వెబ్‌ సిరీస్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. 

 ఈ మధ్యనే  పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్‌ తీసుకుంది.

 మిగతా ప్రొఫెషన్స్‌లాగే యాక్టింగ్‌ కూడా ఒక ప్రొఫెషనే. అందుకే సక్సెస్‌ని పెద్దగా తల తలకెక్కించుకోను అంటుంది మౌనికా రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement