‘బిగ్‌బాస్‌’ ఆఫర్‌ వచ్చింది, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ

Indraja Rejected Bigg Boss 4 Telugu Offer - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్‌ రియాల్టీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షోలో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోలేరు. దానికి కారణం ‘బిగ్‌బాస్‌’ నుంచి బయటకు వస్తే.. డబ్బుతో పాటు సీనీ అవకాశాలు రావడమే. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలోకి వెళ్తుంటారు.

కొంత మంది సెలెబ్రిటీలు మాత్రం అవకాశం వచ్చినా వెళ్లడానికి మొగ్గు చూపపడం లేదు. ఆ లిస్టులో హీరోయిన్‌ ఇంద్రజ కూడా ఉన్నారు. బిగ్‌బాస్‌ నాల్గొ సీజన్‌లో ఇంద్రజకు అవకాశం వస్తే వెళ్లలేదట.ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఇంద్రజ.. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ షోపై తన మనసులోని మాటను బయటకు పెట్టింది.

‘బిగ్‌బాస్‌’ నాల్గో సీజన్‌లో ఆఫర్‌ వచ్చింది. కానీ నేను రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలి.. నేను ఇక్కడ ఉండలేను. అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లలేదు. భవిష్యత్తులోనే అవకాశం వచ్చినా వెళ్లలేదు. అయితే గెస్ట్‌గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌ నాగార్జునని చూడడానికే వెళ్తా. ఆయనతో కాసేపు హ్యాపీగా మాట్లాడి బయటకు వస్తా. నాగ్‌ హోస్టింగ్‌ చాలా బాగుంటుంది. ఇప్పటికీ స్టైలీష్‌గా, అందంగా ఉన్నారు’ అంటూ కింగ్‌ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు ఇంద్రజ. అలాగే నాగార్జునతో కలిసి హలో బ్రదర్‌ సినిమాలో ‘కన్నెపిట్టరో’ పాటకు నటించాని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పటికీ మర్చిపోలేనని’ ఆ మధుర జ్ఞాపకాలను ఇంద్రజ గుర్తుచేసుకుంది.
చదవండి:
అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్‌స్టోరీ చెప్పిన ఇంద్రజ
నవ్వులు పూయిస్తున్న డాక్టర్‌ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top