నవ్వులు పూయిస్తున్న డాక్టర్‌ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్‌

Doctor Rowdy Baby Parody Song Goes Viral - Sakshi

తమిళ హీరో ధనుష్‌, నాచ్యురల్‌ బ్యూటీ సాయిపల్లవి కలిసి స్టెప్పులేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఏ ఫంక్షన్‌లో చూసినా, ఎవరి ఫోన్‌ రింగ్‌ అయినా ఈ పాటనే వినబడేది. అంతలా ఆకర్షించింది ఈ ‘రౌడీ బేబీ’. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించి రికార్డు సాధించింది. ప్రస్తుతం ఇండియా సినిమాల్లో ఏ పాటకు రానన్ని వ్యూస్‌ ‘రౌడీ బేబీ’సొంతం చేసుకుంది. దానికి కారణం కేవలం సాయిపల్లవి క్రేజ్, యాక్టింగ్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె వేసిన స్టెప్పులకి సీనీ అభిమానులు ఫిదా అయ్యారు.

ఇప్పుడిప్పుడే ఈ పాటను కాస్త మర్చిపోతున్న తరుణంలో ఓ డాక్టర్‌ పుణ్యమా అని మళ్లీ అంతా ‘రౌడీ బేబీ’ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ సారి ఒరిజినల్‌ ‘రౌడీ బేబీ’ని కాకుండా.. పేరడీ పాటను విని తెగ నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. దేశంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతన్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో భాస్కర్‌ అనే ఓ వైద్యుడు గుండె ఆరోగ్యం గురించి చెబుతూ.. ‘రౌడీ బేబీ’ పెరడీ పాడారు. మధ్యపానం, ధూమపానం చేయకూడదని, ఉప్పు, మసాల కూడా తక్కువగా తినాలని పాట రూపంలో చెప్పాడు. ప్రస్తుతం ఈ పేరడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top