‘ఇద్దరు’ విజయం సాధించాలి | Sakshi
Sakshi News home page

‘ఇద్దరు’ విజయం సాధించాలి

Published Tue, Jul 4 2023 7:03 PM

Iddaru Movie Pre Release Event Highlights - Sakshi

అర్జున్‌ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్‌ ఖాన్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.ఎస్‌.రెడ్డి సమర్పణలో ఫర్హీన్‌ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌ సమీర్‌ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై  చిత్ర సక్సెస్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు. 

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘అర్జున్‌ మంచి నటుడు. విలక్షణమైన పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. జె.డి.చక్రవర్తికి సినిమా అంటే ప్యాషన్‌. వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం హిట్‌ కావాలి. సమీర్‌ కష్టపడే తత్వం గలవాడు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే అతను బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమ బావుంటుంది’ అని అన్నారు. 

‘ఈ సినిమా ట్రైలర్‌ చూశా. ఆసక్తికరంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలి’ అని తీన్మార్‌ మల్లన్న అన్నారు. ‘యాక్షన్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది’అని దర్శకుడు ఎస్‌ ఎస్‌ సమీర్‌ అన్నారు.

‘చాలా కష్టం పడి సినిమా పూర్తి చేశాం. సినిమాలో హీరో ఎవరు, విలన్‌ ఎవరు అనేది చివరి వరకూ గెస్‌ చేయలేరు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది’ అని నిర్మాత ఫర్హీన్‌ ఫాతిమా అన్నారు. నటుడు సమీర్‌, క్‌కుమార్‌, కరాటే లక్ష్మీ తదితరులతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు. 

Advertisement
 
Advertisement