Allu Arjun: బన్నీ కోసం అల్లు రామలింగయ్య బీమా పాలసీ.. ఎందుకో తెలుసా?

 Icon star allu arjun emotional allu ramalingaiah aravind - Sakshi

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌  ఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌- 2 గ్రాండ్‌ ఫినాలే కోసం ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరు అయ్యారు.  సంగీత ప్రియుల మనుసు దోచుకుంది ఈ షో. ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ.. తన చిన్ననాటి సంగతులను పంచుకున్నారు.

(ఇదీ చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్)

''తాత (అల్లు రామలింగయ్య) గ్రాండ్‌ చిల్డ్రన్‌లలో నేను చాలా క్వయిట్‌గా ఉండేవాడిని... మిగిలిన వారితో పోలిస్తే వీడు మొద్దు, భవిష్యత్త్‌ ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడేమో..! ఆ రోజుల్లోనే నా పేరుతో ఒక ఇన్స్యూరెన్స్‌ చేయించాడు. నేను నామినీగా ఉంటడంతో రూ.10 లక్షలు  నాచేతికి వచ్చాయి. పిల్లలు క్వయిట్‌గా ఉంటే వారి భవిష్యత్‌పై తల్లిదండ్రులకు కూడా సందేహాలు ఉంటాయి. కానీ వారిలో దాగి ఉన్న హిడెన్‌ టాలెంట్‌ను గుర్తించి బయటకు తీస్తే వారి భవిష్యత్‌కు ఎదురే ఉండదు. అల్లు రామలింగయ్య గారికి 8 మంది మనమలు, మనమరాళ్లు.. వారందరిలో మొదట సంపాదించింది నేనే'' అని అల్లు అర్జున్‌ తెలిపారు.

(ఇదీ చదవండి: రాహుల్ సిప్లిగంజ్‌ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!)

తాత బీమా గురించి చెబుతూనే.. తండ్రి (అల్లు అరవింద్‌) గురించి కూడా  మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు బన్నీ.    ''మేం చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజుల్లో ఒకేసారి మా లైఫ్ టర్న్ తీసుకుంది. హైదరాబాద్‌కు మాకన్నా ముందే నాన్న షిఫ్టయిపోయారు… తర్వాత మేం ఇక్కడికి చేరుకున్నాం.  ఓ రోజు మేం ఇద్దరమే ఉన్నప్పుడు హఠాత్తుగా నన్ను హగ్ చేసుకుని, నువ్వు రాబోయే రోజుల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటావు అన్నాడు ప్రేమగా… తన గురించి చెబుతూ పోతే ఒక రాత్రి సరిపోదు… నాకు దేవుడు అంటే మా నాన్నే.. నేను ఏమీ అడగకుండానే అన్నీ నాన్నే ఇచ్చాడు'' అంటూ ఎమోషన‌ల్‌గా చెబుతూ పోయాడు బన్నీ.   తన మాటల్లో హిపోక్రసీ ఏమీ కనిపించలేదు, వినిపించలేదని… చాలా నేచురల్ ఫ్లోతో చెప్పారని బన్నీ ఫ్యాన్స్‌ అంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top