హృతిక్‌ రోషన్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన ట్రైనర్‌ | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: ఈ గ్రీకువీరుడు రోజుకు ఏడుసార్లు తింటాడట! హృతిక్‌ ఫిట్‌నెస్‌ రహస్యమిదే!

Published Fri, Jan 12 2024 11:16 AM

Hrithik Roshan's Trainer Reveals Secret To His Greek God Physique - Sakshi

ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండాలంటే ఫిట్‌నెస్‌ తప్పనిసరి! సినిమా స్క్రిప్టుకు తగ్గట్లుగా తమ శరీరాకృతిని మార్చుకుంటూ ఉంటారు హీరోహీరోయిన్లు. ఇందుకోసం కఠినమైన డైట్‌, వర్కవుట్స్‌ పాటిస్తుంటారు. అందుకే 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ తమ క్రేజ్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ అందగాడు, గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ను బయటపెట్టాడు అతడి ట్రైనర్‌.

ఏది వర్కవుట్‌ కాదో బాగా తెలుసు
హృతిక్‌ దగ్గర దశాబ్దకాలం పాటు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తున్న క్రిస్‌ గెతిన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'హృతిక్‌ తన నెక్స్ట్‌ సినిమా ఫైటర్‌ కోసం తన బాడీని సిద్ధం చేస్తున్నాడు. వేకువజామున ఐదు గంటలకు నిద్ర లేచి, రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాడు. ఏకాగ్రతతో, పట్టుదలగా ఉండేవారితో కలిసి పని చేయడమంటే నాకెంతో ఇష్టం. హృతిక్‌ అలాంటి కోవకే చెందుతాడు. తను చాలా తెలివైనవాడు. ఏది చేస్తే బాగుంటుంది? ఏది వర్కవుట్‌ కాదనేది తనకు బాగా తెలుసు. ఫైటర్‌ కోసం ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచే హృతిక్‌ ఆరింటికల్లా బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్నాడు.

ఐదు రోజులే వర్కవుట్స్‌
ఆ తర్వాత మేము 45 నిమిషాల పాటు జిమ్‌లో కష్టపడుతాం. వర్కవుట్స్‌ గంట కన్నా ఎక్కువసేపు అవసరం లేదు. చేసిన కాసేపైనా చాలా కష్టంగా ఉండేవాటినే సెలక్ట్‌ చేస్తాను. కంటి నిండా నిద్రపోతే వారంలో ఐదు రోజులు వర్కవుట్స్‌ సరిపోతుంది. సరిగా నిద్ర లేకపోతే నాలుగు రోజులే షెడ్యూల్‌ ఉంటుంది. హృతిక్‌ రోజుకు ఒకటీరెండు సార్లు కార్డియో ఎక్సర్‌సైజ్‌ చేస్తాడు. కార్డియో అంటే రన్నింగ్‌, స్టెయిర్‌ మాస్టర్‌, ఎలిప్టికల్‌, స్విమ్మింగ్‌.. ఇలా చాలా ఉంటాయి. 

బోరింగ్‌ ఫుడ్‌..
అతడు రోజుకు ఆరేడు సార్లు తింటాడు. ఒకవేళ తినకపోతే వాటినే జ్యూస్‌లుగా తీసుకుంటాడు. ఫైటర్‌ కోసం అతడు తినే ఫుడ్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ అతడి చెఫ్ బోరింగ్‌ వంటల్ని కూడా రుచికరంగా మార్చేస్తాడు. నా దగ్గరకు వచ్చే చాలామంది హృతిక్‌ రోషన్‌లా తమ లుక్‌ మార్చేయమని అడుగుతారు. ప్రతి ఒక్కరూ అతడిలా మారిపోవడం అంత ఈజీ కాదు. అవతలి వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్‌ మనలో ఉండవు. మనలో ఉన్నవి అవతలివారిలో ఉండవు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ

whatsapp channel

Advertisement
 
Advertisement