హృతిక్ రోషన్, దీపికా పదుకొనె 'ఫైటర్‌' నుంచి పార్టీ సాంగ్‌ రిలీజ్‌ | Hrithik Roshan Fighter Movie First Song Released | Sakshi
Sakshi News home page

హృతిక్ రోషన్, దీపికా పదుకొనె 'ఫైటర్‌' నుంచి పార్టీ సాంగ్‌ రిలీజ్‌

Dec 16 2023 9:27 AM | Updated on Dec 16 2023 9:29 AM

Hrithik Roshan Fighter Movie First Song Released - Sakshi

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఫైటర్‌.. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఎక్కువగా ఏరియల్ యాక్షన్ సన్నివేశాలే ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం నాటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని 2024 జనవరి 25న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

తాజాగా ఫైటర్ మూవీ నుంచి "షేర్ కుల్ గయ" అనే పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో గతంలో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలు వచ్చాయి. అవి రెండూ కూడా సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement