ఆరు ఎపిసోడ్లు.. తొంభై కోట్లు

Hrithik Roshan being offered Rs 90 crore by an OTT - Sakshi

వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ షోలకు బాగా ఆదరణ పెరగుతోంది. దీంతో టాప్‌ స్టార్స్‌ను కూడా ఓటీటీ మీడియమ్‌లోకి తీసుకురావడానికి ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ఓ వెబ్‌ షో చేయబోతున్నారని టాక్‌. ఇందుకోసం ఆయనకు భారీ పారితోషికం కూడా అందబోతోందని సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ యాక్షన్‌ నిండిన ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతోందట. ఇందులో హృతిక్‌ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారని భోగట్టా. ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్‌కుగాను హృతిక్‌ సుమారు 90 కోట్లు తీసుకోనున్నారట. భారతీయ భాషలన్నింట్లోనూ ఈ సిరీస్‌ విడుదల కానుందని టాక్‌. ఈ సిరీస్‌లో హృతిక్‌ సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సిరీస్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top