మార్చిలో తంత్ర | Sakshi
Sakshi News home page

మార్చిలో తంత్ర

Published Sat, Feb 24 2024 5:43 AM

Horror thriller Tantra will release on March 15 - Sakshi

అనన్య నాగళ్ల లీడ్‌ రోల్‌లో నటించిన ‘తంత్ర’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. మార్చిలో ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్‌ రఘుముద్రి, సలోని, ‘టెంపర్‌’ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్‌ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీపై నరేష్‌ బాబు పి, రవి చైతన్య నిర్మించారు.

ఈ మూవీని మార్చి 15న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘హారర్‌ నేపథ్యంతో రూపొందిన ‘తంత్ర’ చిత్రం ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల చక్కగా నటించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తేజ్‌ పల్లి, కెమెరా: సాయిరామ్‌ ఉదయ్, విజయ భాస్కర్‌ సద్దాల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌.

Advertisement
Advertisement