నెట్‌ఫ్లిక్స్‌నే మోసం చేసిన డైరెక్టర్.. చివరికీ ఏమైందంటే? | Hollywood director Carl Rinsch gets two and half years in prison | Sakshi
Sakshi News home page

Carl Rinsch: నెట్‌ఫ్లిక్స్‌నే మోసం చేసిన డైరెక్టర్.. చివరికీ ఏమైందంటే?

Jun 30 2026 2:21 PM | Updated on Jun 30 2026 2:31 PM

Hollywood director Carl Rinsch gets two and half years in prison

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ కార్ల్ ఎరిక్ రించ్‌కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఓ సిరీస్ తీసేందుకు నెట్‌ఫ్లిక్స్ నిధులను తన ‍వ్యక్తిగత ‍అవసరాలకు వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అతను దాదాపు 11 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ తీస్తానని నెట్‌ఫ్లిక్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాల కోసం కార్లు, క్రిప్టోకరెన్సీ, ఇతర విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకున్నాడు. దీంతో అతనిపై నెట్‌ఫ్లిక్స్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో దర్శకుడు దోషిగా తేలడంతో న్యాయస్థానం జైలు శిక్షతో పాటు 700 డాలర్ల జరిమానా విధించారు. కాగా.. డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ 2013లో వచ్చిన '47 రోనిన్' చిత్రంతో బాగా ఫేమస్ అయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement