‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌ కోసం లండన్‌ థియేటర్‌ బుక్‌ చేసిన బాలీవుడ్‌ నిర్మాత

Heropanti 2 Producer Sajid Nadiadwala Books Entire Theatre For Team In London - Sakshi

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, కృతి సనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరోపంతి 2’. లండన్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం గురువారం విడుదలై జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ ‘నో టైమ్‌ టు డై’ సినిమాను అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్‌ చేసింది. ఈ జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ చూసేందుకే నిర్మాత సాజిద్‌ నడియద్‌వాలా ‘హీరోపంత్‌ 2 మూవీ టీం, క్రూడ్‌ కోసం ఏకంగా లండన్‌లోని థియేటర్‌ మొత్తం బుక్‌ చేశాడట. లండన్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెలబ్రెషన్స్‌లో భాగంగా థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసి చిత్రం బృందంతో కలిసి ఆయన సినిమా చూశాడు. 

చదవండి: ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్‌ నుంచి తొలగించారు

నిర్మాతతో పాటు హీరో టైగర్‌ ష్రాఫ్‌, నటి తార సుతరియా, డైరెక్టర్‌ అహ్మద్ ఖాన్‌తో పాటు మిగతా తారగణం, క్రూడ్‌ ఉన్నారు. నెల రోజుల పాటు లండన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ‘హీరోపంత్‌ 2’ టీం ఈ నేపథ్యంలో ‘నో టైమ్‌ టూ డై’ సినిమాను చూసి సెలబ్రెట్‌ చేసుకున్నారు. కాగా ఆహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హీరోపంత్‌ 2’ వచ్చే ఏడాది మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: జేమ్స్‌ బాండ్‌: ‘నో టైమ్‌ టు డై’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతో తెలుసా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top