Shruti Haasan: పారితోషికం పెంచేసిన శ్రుతి.. అన్ని కోట్లు డిమాండ్‌ చేస్తుందట!

Heroine Shruti Haasan Hikes Remuneration Upto 3 Crore Rupees - Sakshi

సాధారణంగా హీరోయిన్లు వ్యక్తిగత విషయాలు వెల్లడించడానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే ప్రేమ, బాయ్‌ఫ్రెండ్‌ వంటి విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. పెళ్లి గడియలు దగ్గర పడే వరకు నోరు మెదపరు. కారణం కెరీర్‌ గురించి కేర్‌ కావచ్చు. మీడియా వదంతులకు భయపడి కావచ్చు. అయితే ఇలాంటి వాటికి భయపడని బ్యూటీ ఒకరున్నారు. ఆమే శ్రుతిహాసన్‌. ఈమె వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు అన్నీ బహిర్గతమే.

ఇంకా మింగిల్‌ గాని శ్రుతి హాసన్‌ బాయ్‌ఫ్రెండ్స్‌ను మాత్రం ఇప్పటికే ఇద్దరిని మార్చేసింది. ఇక వృత్తి పరంగానూ ఈమె సంచలనమే. పాత్రకు అవసరమైతే గ్లామర్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా నటిస్తుంది.అభిమానులకు నచ్చే విషయం ఇదే. హిందీ, తెలుగు, తమిళం భాషలను చుట్టేస్తున్న ఈ బ్యూటీని ప్రస్తుతం ఎక్కువగా ఇష్టపడుతుంది మాత్రం టాలీవుడే. సక్సెస్‌లు కూడా అక్కడే ఎక్కువ. ప్రస్తుతం సలార్, బాలకృష్ణ సరసన ఒక చిత్రం, చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రం చేస్తూ బిజీగా ఉంది.

ఈ మూడు చిత్రాలపైన భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో పారితోషికం విషయంలోనూ శృతిహాసన్‌ కోటికి తగ్గేదేలే అంటున్నట్లు తాజా సమాచారం. ఇందుకు కారణం ఈమె ఇంతకు ముందు నటించిన చలన చిత్రాలు మంచి విజయాన్ని సాధించడమే. సలార్‌ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా నటిస్తున్న ఈ భామ పారితోషికంగా రూ.  2.5-3 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట.దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను  శ్రుతి బాగా ఫాలో అవుతోందని అంటున్నారు సినీవర్గాలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top