Heroine Nayanthara Responds On GodFather Movie Success - Sakshi
Sakshi News home page

Nayanathara: ఆయనను ఎందుకు ఇష‍్టపడతారో ఇప్పుడే తెలిసింది: నయనతార

Oct 9 2022 3:06 PM | Updated on Oct 9 2022 3:49 PM

Heroine Nayanthara Responds On GodFather Movie Success - Sakshi

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన చిరంజీవి గాడ్‌ఫాదర్‌ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో చిత్రబృందం సక్సెస్‌ మీట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా విజయం పట్ల ప్రధానపాత్రలో నటించిన కోలీవుడ్ భామ నయనతార తాజాగా స్పందించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేసింది.  

నయనతార నోట్‌లో రాస్తూ.. 'గాడ్‌ ఫాదర్‌ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపినందుకు సినీ ప్రేమికులు, నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారణం అద్భుతమైన చిత్రబృందమే. మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. నాపై నమ్మకం ఉంచి మరో అవకాశమిచ్చిన దర్శకుడు మోహన్ రాజాకు కృతజ్ఞతలు. సల్మాన్ ఖాన్‌ను ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడతారో ఈ సినిమా ద్వారా తెలిసింది.  ఈ చిత్రం భారీ విజయం సాధించినందుకు ఆయనకు ధన్యవాదాలు'. అంటూ రాసుకొచ్చింది. మలయాళంలో మోహన్‌లాల్  చిత్రం లూసిఫర్ తెలుగు రీమేక్‌ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో సత్యదేవ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్, గంగవ్వ, సునీల్, బ్రహ్మాజీ, కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement