బుజ్జులు.. బుజ్జులు...

hero srikanth son roshan pelli sandadi song launch - Sakshi

రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్టో తెలిసిందే. తాజాగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమా రూపొందుతోంది. ఆదివారం (మే 23) న రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని రెండవ పాట ‘బుజ్జులు.. బుజ్జులు’ను విడుదల చేశారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌. కె. కృష్ణ మోహన్‌రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు.

‘‘పాలకుండ నెత్తినెట్టి పంజగుట్ట పోతవుంటే.. బుజ్జులు..  బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు...’’ అని సాగే పాటను రిలీజ్‌ చేశారు. గౌరి మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్‌గా ఈ సినిమా నాకో ఛాలెంజ్‌. రాఘవేంద్రరావు, కీరవాణిగార్ల హిట్‌ కాంబినేష¯Œ లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్రతి పాట అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఏడు రోజులు ప్యాచ్‌వర్క్‌ ఉంది. లాక్‌డౌన్‌ ముగిశాక పూర్తి చేసి, జూ¯Œ  లేదా జూలైలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయిబాబా కోవెల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top