శరణ్ కుమార్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. శివ కేశర కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం శరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆవిరి పట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శరణ్ కుమార్ ముఖం కనిపించేలా డిఫరెంట్‌గా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ హీరో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా దానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘హీరో శరణ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేయడం హ్యపీగా ఉంది. సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శరణ్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేస్తాం’’ అన్నారు.
చదవండి : ‘చింత మ్యారేజ్ బ్యూరో.. సంబంధం కుదరని యెడల డబ్బులు వాపసు’
Tuck Jagadish: ఆ పరిస్థితి లేదు.. అందుకే ఓటీటీకి వెళ్లాం