Actor Nikhil Fires On Sai Dharam Tej ICU Video - Sakshi
Sakshi News home page

ఐసీయూలో అయినా వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి: నిఖిల్‌

Sep 14 2021 11:27 AM | Updated on Sep 14 2021 3:27 PM

Hero Nikhil Fires On Viral Of Sai Dharam Tej ICU Video - Sakshi

Sai Dharam Tej Health Condition: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆసుపత్రి వీడియో బయటకు రావడంపై హీరో నిఖిల్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి తేజ్‌ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో గాయపడిన సాయి తేజ్‌ని మొదట మాదాపూర్‌లోని మెడికోవర్‌ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు.

చదవండి: నిలకడగా సాయి తేజ్‌ ఆరోగ్యం, ఇంకా 36 గంటలు అబ్జర్వేషన్‌లో..

అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న తేజ్‌ను సృహాలోకి తీసుకువచ్చేందుకు డాక్టర్స్‌ ప్రయత్నిస్తున్న వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కళ్లు తెరవండి.. ఇటూ చూడండి అంటూ డాక్టర్‌ భుజం తట్టి లేపుతుంటే తేజ్‌ కాస్తా చేయి కదిపాడు. దీంతో ఈ వీడియో మీడియా, సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇక తమ అభిమాన హీరో ప్రమాద వార్త విని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ వీడియో ఊరటనిచ్చింది. అయితే హీరో నిఖిల్ మాత్రం ఈ వీడియో బయటకు రావడంపై అసహనం వ్యక్తం చేశాడు.

చదవండి: సాయి తేజ్‌ మూడు రోజుల్లో బయటకు వస్తారు: మోహన్‌బాబు

నిఖిల్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఐసీయూలో ఉన్నప్పుడైన వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. అసలు ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతి ఇస్తున్నారు. సాయి తేజ్‌ ఐసీయూ వీడియో ఇలా బయటకు రావడం దారుణం’ అంటూ ఫైర్‌ అయ్యాడు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌ కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి భాగంలో గాయమైంది. ఆదివారం సాయి తేజ్‌ కాలర్‌ బోన్‌కు అపోలో వైద్యులు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సాయి తేజ్‌ ఆరోగ్యంపై వైద్యులు పత్రికి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇక సాయి తేజ్‌ని పరామర్శించేందుకు పలువురు సినీ ప్రముఖుల ఆసుపత్రికి వచ్చి వెళుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement