Sai Dharam Tej Health Condition: Apollo Hospitals Release Sai Dharam Tej Health Bulletin - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej Health Condition సాయి తేజ్‌ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌

Sep 13 2021 2:25 PM | Updated on Sep 13 2021 3:37 PM

Apollo Hospitals Release Sai Dharam Tej Health Bulletin - Sakshi

అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న (ఆదివారం) సాయి తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అపోలో వైద్యులు సోమవారం సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘సాయి తేజ్‌ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యింది.

చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్‌ కాలర్‌ బోన్‌ సర్జరీ సక్సెస్‌, హెల్త్‌ బులెటిన్‌ విడుదల

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మొదట్లో ఉన్న దానికంటే వెంటిలేటర్‌ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంది’’ అని అపోలో వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్‌ తేజ్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement