వరుస ఫ్లాపులు.. నాని పరిస్థితి ఇలా అయిందేంటి?

Hero Nani Waiting For Big  Hit, Made Expectations On Dasara Movie - Sakshi

ఒకప్పుడు నానికి మినిమం గ్యారెంటీ హీరో ఇమేజ్ ఉండేది. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు.. సింపుల్ స్టోరీస్ తో ఇంప్రెస్ చేస్తాడని ఆడియెన్స్ థియేటర్ వరకు వచ్చేవారు. ‘జెర్సీ’ వరకు నాని జర్నీ బాగానే సాగింది. ఈ మూవీ తర్వాత నుంచే నేచురల్ స్టార్‌కు కష్టాలు మొదలయ్యాయి. గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి చిత్రాలు నానీకి కావాల్సిన హిట్స్ గా మారలేకపోయాయి. ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ వరకు వెళ్లలేకపోయాయి.

(చదవండి: కొరటాలపై కోపంగా ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, కారణం ఇదే!)

నాని కంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్లు ఎప్పుడూ అలాంటి చిత్రాలే చేస్తే ఎలా? అందుకే ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్నట్లు నేచురల్ స్టార్‌ చెప్పుకొస్తున్నాడు. కాని ఈ ప్రయోగాలు నానికి తన సెక్షన్ ఆడియెన్స్ ను దూరం చేస్తున్నాయి. ప్రస్తుతం దసరా అనే టైటిట్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు నాని. తెలుగులో వస్తోన్న శక్తివమంతమైన నాటు మూవీ అంటున్నాడు నేచురల్. ప్రస్తుతం 30 శాతం వరకు షూటింగ్ పూర్తైంది. ఈ మూవీతోనైనా నాని టాలీవుడ్ కు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top