NTR 30 Movie: కొరటాలపై కోపంగా ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, కారణం ఇదే!

NTR 30: Jr NTR Fans Angry On Koratala Siva - Sakshi

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంకా అలాగే ఎన్టీఆర్ కలిసి నటించారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఈ సినిమా ద్వారా వీరిద్దరు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులర్ అయ్యారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు ఎన్టీఆర్ కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం వీరు ఇద్దరూ కూడా వారి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది. అయితే కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలై దారుణంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఆచార్య ప్రభావం ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద పడనుంది.

(చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన)

ఆచార్య సినిమా డిజాస్టర్ వల్ల ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమాకు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా జనతా గ్యారేజ్ కు వంటి ఒక మంచి స్క్రిప్ట్ ను కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

ఇక అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పట్టాలెక్కి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా వాయిదా పడటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ వల్ల మూడేళ్ల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ..ఇక ఈ సినిమా ద్వారా తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అది ఇప్పుడు సాధ్యపడేలా కనిపించటం లేదు. ఇక ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top