Rashmika Mandanna: పెంపుడు కుక్కకి ఫ్లైట్‌ టికెట్స్‌ డిమాండ్‌ చేసిన రష్మిక? నటి రియాక్షన్‌!

Rashmika Mandanna Response On The Demands Flight Tickets for Her Dog From Producers - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పోతుంది. ఇక పుష్ప చిత్రంతో రాత్రికి రాత్రే పాన్‌ స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఆమెకు నార్త్‌ నుంచి సౌత్‌గా డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవల తన సినిమా షూటింగ్‌లో భాగంగా నిర్మాతలను రష్మిక ఇబ్బంది పెట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!

షూటింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి మరో ప్రాంతానికి రష్మిక పయణించాల్సి ఉండగా తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా ప్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేసిందని పలు వెబ్‌సైట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కాస్తా రష్మిక కంటపడ్డాయి. దీంతో వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను ట్విట్‌ర్‌లో షేర్‌ చేసి సదరు వార్తలను కొట్టిపారేసింది. ఈ మేరకు రష్మిక ట్వీట్‌ చేస్తూ.. ‘హే.. ఇలాంటి రూమర్స్‌ ఎలా సృష్టిస్తారలో అర్థం కాదు. ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో కలిసి పయణించాలని మీకు ఉన్న. తనకు మాత్రం నాతో ట్రావెల్‌ చేయడం అసలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్‌లోనే హ్యాపీ ఉంటుంది’ అంటూ పడిపడి నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది.

చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం

ఆ తర్వాత మరో ట్వీట్‌లో ‘క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా’ అంటూ కామెంట్‌ చేసింది రష్మిక. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక రష్మిక ట్వీట్‌కు ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఇది మాత్రమే కాదు మేడం.. ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని అన్నాడు. అతడికి కామెంట్స్‌పై రష్మిక ‘ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్‌’ అని చెప్పింది. కాగా ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ సరసన ఎనిమల్‌ మూవీతో పాటు వంశీపైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న వరిసు(వారసుడు) చిత్రాలతో బిజీ ఉంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top