రానాకు నాని శుభాకాంక్షలు: ఐకానిక్‌ బ్యాచిలర్‌ ముగింపు | Hero Nani Funny Wishes To Rana Daggubati On His Marriage | Sakshi
Sakshi News home page

రానాకు నాని శుభాకాంక్షలు: ఐకానిక్‌ బ్యాచిలర్‌ ముగింపు

Aug 8 2020 9:12 PM | Updated on Aug 8 2020 9:23 PM

Hero Nani Funny Wishes To Rana Daggubati On His Marriage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దగ్గుబాటి వారసుడు రానా, మిహిక బజాజ్‌లు నేడు మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇవాళ అగష్టు 8న కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య రానా-మిహిక వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భం ఈ కొత్త జంట సీనీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అదే విధంగా నేచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో రానాకు శుభకాంక్షలు తెలిపాడు. ఇలా ‘ఐకానిక్‌ బ్యాచిలర్‌ ముగింపు.. చివరి నవ్వు అంటూ కళ్లు మూసి నోరు తెరిచి నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. (చదవండి: రెడీ: రానా దగ్గుబాటి)

‘‘శుభాకాంక్షలు బాబాయ్‌ అంటూ ‌ కళ్లకు ఫోన్ అడ్డు పెట్టుకుని ఫొటోకు ఈ టెక్నాలజీ ఎంటో బాబాయ్‌’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక గతంతో కూడా రానా -మిహికా పెళ్లి విషయం తెలిసి ఈ 2020 ఏడాది ఎనేన్ని వింతలు చూడాలో అంటూ సరదాగా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా గతంలో మిహిక బజాజ్‌ ప్రేమిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేసి  అన్ని చకచక అయిపోయాయి.  

Advertisement
 
Advertisement
Advertisement