రాముడి తల్లి?

Hema Malini Playing Key role in Prabhas movie - Sakshi

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియావే. ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు ప్రభాస్‌. ఈ చిత్రంలో సీనియర్‌ నటి హేమమాలిని ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా, నటించేందుకు పచ్చజెండా ఊపారని టాక్‌. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. హేమ మాలిని రాముడి తల్లిగా కనిపించనున్నారట. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్, ఓం రౌత్, కిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top