హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..! | Sakshi
Sakshi News home page

Heeramandi: హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!

Published Tue, May 28 2024 5:17 PM

Heeramandi Actor Taha Shah Badussha REACTS To Dating Rumours With Pratibha

బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్‌లో లాహోర్‌లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే సిరీస్‌లో షర్మిన్ సెగల్‌(ఆలంజేబ్‌) ప్రియుడిగా తహా షా బాద్‌షా నటించారు.

అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్‌షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్‌ కేవలం షూట్‌ వరకే ఉంటుందని బాద్‌షా అన్నారు. 

ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్‌లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్‌దార్‌ పాత్రలో మెప్పించాడు. షర్మిన్‌ సెగల్‌ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్‌లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement