హీరో? విలన్‌?.. నచ్చితే ఏ పాత్రైనా ఓకే! | Havish About His Film Career | Sakshi
Sakshi News home page

ఇకపై గ్యాప్‌ ఇవ్వను: హీరో

Jun 25 2021 7:59 AM | Updated on Jun 25 2021 7:59 AM

Havish About His Film Career - Sakshi

2011లో నువ్విలా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. ఈ పదేళ్లలో నాలుగు సినిమాలు చేశాను. ఓ సినిమా..

"ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాల్లో నటించాలనుకునేవాణ్ణి. అంతేకాని హీరోనా? విలన్‌గానా? అని ఆలోచించలేదు. ఇప్పుడూ అంతే.. కథ నచ్చితే ఏ పాత్రైనా చేస్తా" అన్నారు హీరో హవీష్‌. నువ్విలా, జీనియస్‌, రామ్‌లీలా, 7 వంటి చిత్రాల్లో నటించిన హవీష్‌ పుట్టినోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "2011లో నువ్విలా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. ఈ పదేళ్లలో నాలుగు సినిమాలు చేశాను. ఓ సినిమా విడుదలయ్యాక మరో సినిమా చేయడంతో ఇంత గ్యాప్‌ వచ్చింది"

"రాక్షసుడు నిర్మిస్తున్నప్పుడు సినిమా సినిమాకీ గ్యాప్‌ ఇవ్వకూడదనే విషయం అర్థమైంది. ఇకపై గ్యాప్‌ రానివ్వకుండా సినిమాలు చేస్తాను. నేను హీరోగా దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించనున్న సినిమా ఆగస్టులో మొదలవుతుంది. మరో సినిమా కూడా చేయనున్నాను. రవితేజ హీరోగా నేను నిర్మిస్తున్న ఖిలాడీ సినిమా 20 రోజులు షూటింగ్‌ మిగిలి ఉంది" అన్నారు.

చదవండి: వాళ్లు నన్ను మోసం చేశారు: నటి షబానా అజ్మీ

Advertisement
 
Advertisement
Advertisement